15 వ రోజు అదరగొట్టిన మన శంకరవరప్రసాద్ గారు

Mana Shankaravara Prasad Rocks the Box Office on Day 15

మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతిహతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 358 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రీజినల్ సినిమాల్లో ఆల్-టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

15వ రోజు ఆల్-టైమ్ టాప్ 3 లో స్థానం సంపాదించుకుంది. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు దినం కావడంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 15వ రోజున కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంది. ఈ ఒక్క రోజే సుమారు రూ. 3.14 కోట్ల షేర్ వసూలు చేసి, టాలీవుడ్‌లో 15వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

15వ రోజు వసూళ్లలో ‘హనుమాన్’ (రూ. 5.30 కోట్లు), ‘అల వైకుంఠపురములో’ (రూ. 3.70 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడో స్థానాన్ని దక్కించుకుని మెగాస్టార్ స్టామినాను నిరూపించింది.

బుక్‌మైషోలో కేవలం 15 రోజుల్లోనే బుక్‌మైషోలో 3.6 మిలియన్ల టికెట్లు అమ్ముడై, ‘సంక్రాంతికి వస్తున్నాం’ (3.5 మిలియన్లు) రికార్డును అధిగమించి ఆల్-టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్‌గా నిలిచింది.

ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.అటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం దాదాపు 4.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 40.25 కోట్లు) వసూళ్లతో చిరంజీవి మరియు అనిల్ రావిపూడిల కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్‌గా నిలిచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.