బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ (KING)తో బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు నేడు (జనవరి 24, 2026) చిత్ర యూనిట్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ‘కింగ్’ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు షారుఖ్ ఖాన్ మరియు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక ప్రత్యేక టీజర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “కింగ్ ఈజ్ రెడీ టు రోర్ ఆన్ 24.12.2026” అంటూ విడుదల చేసిన ఈ టీజర్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ మునుపెన్నడూ చూడని విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, ఒక పవర్ఫుల్ మొబైల్ బాస్‌గా కనిపిస్తున్నారు. టీజర్లో షారుఖ్ చెప్పే “డర్ నహీ.. దెహషత్ హూ” (భయం కాదు.. భీభత్సాన్ని) అనే డైలాగ్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో హింట్ ఇస్తోంది. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రం చేస్తుండటం విశేషం.
అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. పఠాన్ , జవాన్ లతో వరసగా రెండు సార్లు 1000కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించిన షారుక్ కింగ్ తో మూడో సారి ఈ క్లబ్ లో చేరతాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























