హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘VD14’ గురించి తాజాగా ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ వెలువడింది. ‘టాక్సీవాలా’ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ను జనవరి 26న (రిపబ్లిక్ డే సందర్భంగా) ప్రకటించనున్నారు. టైటిల్ తోపాటు గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా 19వ శతాబ్దపు బ్రిటిష్ వలస పాలన కాలం నాటి నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరక్కుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ తన కెరీర్లోనే మునుపెన్నడూ చూడని విధంగా రస్టిక్ లుక్లో కనిపించబోతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అజయ్-అతుల్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో ఒక కీలక పాత్రలో నటించబోతుండటం ఈ ప్రాజెక్టును పాన్-వరల్డ్ స్థాయికి తీసుకెళ్తోంది. ఈఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇక విజయ్ ప్రస్తుతం ఈసినిమాతోపాటు రౌడీ జనార్ధన కూడా చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈసినిమా కూడా ఈ ఏడాదే విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























