శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే వసూళ్లను సొంతం చేసుకుంది.ముఖ్యంగా ఇందులో రోషన్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. తొలుత జనవరి 23న విడుదలవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజా అప్డేట్ ప్రకారం జనవరి 29, 2026 (గురువారం) నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. 1947 నేపథ్యంలో, రజాకార్ల అరాచకాలు మరియు భైరాన్పల్లి పోరాటం వంటి చారిత్రక అంశాలను ఫుట్బాల్ క్రీడతో ముడిపెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వప్న సినిమాస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ భారీ పీరియాడికల్ డ్రామాను మిస్ అయిన వారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వీక్షించవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























