నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ విడుదల తేదీ మారింది. తొలుత ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరింత సమయం తీసుకుంటుండటంతో, సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావించిన చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం, ‘స్వయంభు’ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సమ్మర్ సెలవులను దృష్టిలో పెట్టుకుని, పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసేందుకు ఈ తేదీని ఖరారు చేశారు.త్వరలోనే రీలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రానంది. నిఖిల్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, విలువిద్య మరియు కత్తిసాము వంటి యుద్ధ కళల్లో శిక్షణ పొందారు.
ఈ చిత్రంలో సంయుక్త మీనన్ మరియు నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























