ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు, ఈ సినిమాని అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులకు, ఈ టైటిల్ ఇచ్చి ముహూర్తం పెట్టిన మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్ననే బాలయ్య గారితో మాట్లాడాను. నా పేరు నిలబెట్టావ్ అన్నారు. నెక్స్ట్ సినిమా నుంచి మీరే ముహూర్తం పెట్టాలని అడిగాను. ముందుగా శ్రీ విష్ణు గారికి థాంక్స్. చివర్లో కామియో రోల్ చేయడం శ్రీ విష్ణు గారి గొప్ప మనసు. ఒక హీరో సినిమాని ఫ్రెండ్షిప్ ని నమ్మి చేయడం అనేది మామూలు విషయం కాదు. అనిల్ గారి ప్రొడక్షన్స్ లో మా ఇద్దరికి కలిసి ఒక కథ రాస్తే తప్పకుండా చేస్తాం. చిన్ని గారితో పదేళ్ళ ఏళ్ల అనుబంధం. ఆయనతో సినిమా చేయాలి. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సుదర్శన్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇందులో తన క్యారెక్టర్ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. భాను నందు రైటింగ్ కి చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ ఇలాగే కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. రామ్ నెక్స్ట్ జనరేషన్ కి చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. జంధ్యాల, ఈవివి గారు తర్వాత ఇప్పుడు అప్ కమింగ్ లో తను ఉన్నాడు. మా కెమెరా మెన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు.
మా టీం అందరికీ థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన వశిష్ట గారికి, త్రినాధ్ గారికి మీడియా మిత్రులకు అందరికీ థాంక్యు. హిట్ వచ్చింది కదా ఎలా ఫీలవుతున్నావ్ అని అడుగుతున్నారు. నిజానికి ఎలా ఫీల్ అవ్వాలి కూడా నాకు తెలియడం లేదు. అందరూ హ్యాపీగా నవ్వుతుంటే చూడడం చాలా బాగుంది. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని మాకు ఇచ్చారు. ఈ సినిమా ఎక్కడితో ఆగదు. మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడుతుంది. ఇప్పుడు నుంచి టాక్ స్టార్ట్ అయింది. థియేటర్స్ పెంచాం. ఈ ఫ్రీ డే నుంచి మేమేంటో చూపిస్తాం. అనిల్ గారికి థాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. హీరో ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుందనేది మేము చూపిస్తాం. నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను. మళ్ళీ అనిల్ గారు పెద్ద సినిమా చేసే వరకు రూపాయి కూడా తీసుకోను. ఇది నా ప్రామిస్. ఎందుకంటే హిట్ వాల్యూ మాకు తెలుసు. అలాంటి హిట్ ఆయన నాకు ఇచ్చారు. ఆడియన్స్ అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు సో మచ్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























