ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ ఈరోజు అర్ధరాత్రి 12గంటలనుండి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రాంజనా’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అదే తరహాలో అత్యంత ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకుంది.డిసెంబర్ లో విడుదలైన ఈసినిమా 100కోట్లపైనే వసూళ్లను అందుకొని విజయాన్ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. హిందీతోపాటు తెలుగు ,తమిళంకూడా అందుబాటులోకి రానుంది . ధనుష్ నటన మరియు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో ధనుష్ తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. థియేటర్లలో ఈ హృద్యమైన ప్రేమకథను మిస్ అయిన వారు, ఇప్పుడు ఓటీటీలో వీక్షించే అవకాశం కలగనుంది. మరి ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























