మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ శరవేగంగా ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పనులను పూర్తి చేసి, ఫైనల్ లాక్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ లాక్ చేసిన ఫస్ట్ హాఫ్ ఎడిట్ను నేపథ్య సంగీతం కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్కు పంపారు. రీసెంట్ గా ఈసినిమానుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ సంచలనం సృష్టించగా, ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో రెహమాన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఒక పక్కా లోకల్ అండ్ రస్టిక్ రోల్లో కనిపిస్తుండటంతో పెద్ది పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాడు.ఇక ఈసినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఇందులో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యాడు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం 2026, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలో విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























