మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Responds to Mana Shankara Vara Prasad Garu’s Victory

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది.ఇప్పటికే ఈసినిమా 300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది. ఇక ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంపై పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారని నిర్మాత సుష్మిత కొణిదెల ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ సినిమాను చూడలేదు. అయితే సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మరియు బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. సినిమా భారీ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా సుస్మితకు మెసేజ్ చేస్తూ, “సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.. ఆల్ ది బెస్ట్” అని అభినందనలు తెలిపారు. ప్రస్తుతం టైమ్ కుదరడం లేదని, కొంచెం ఫ్రీ అయిన వెంటనే తప్పకుండా సినిమా చూస్తానని ఆయన మాటిచ్చినట్లు సుస్మిత పేర్కొన్నారు.

అన్నయ్య సినిమా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వ్యక్తిగతంగా సెలబ్రేట్ చేసుకుంటారని మనకు తెలిసిందే. వింటేజ్ చిరంజీవిని వెండితెరపై చూడటం పవన్ కళ్యాణ్‌కు ఎంతో ఇష్టమైన విషయం కావడంతో, ఆయన స్పెషల్ స్క్రీనింగ్‌లో సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఫీడ్‌బ్యాక్ కోసం చిత్ర బృందం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.