అమెరికాలో అదరగొడుతున్న అనగనగా ఒక రాజు

Anaganaga Oka Raju Rocks the US Box Office

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఓవర్సీస్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నవీన్,ఆ తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో అక్కడి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక ఇప్పుడు అనగనగా ఒక రాజు తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్నటి తో ఈసినిమా నార్త్ అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఫుల్ రన్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది.అంతేకాదు ఈసినిమా నవీన్ కెరీర్ లో హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. మొదటి రోజు నుండే అక్కడ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు నిలకడగా సాగుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్సు నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.అమెరికాలో ఈ సినిమాను కొనుగోలు చేసిన పంపిణీదారులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను అందుకుంటున్నారు.

ఈ విజయంతో నవీన్ పొలిశెట్టి అమెరికాలో అత్యంత క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన పెద్ద సినిమాల పోటీలోనూ ‘అనగనగా ఒక రాజు’ ఇంతటి వసూళ్లు రాబట్టడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈసినిమా కేవలం 6 రోజుల్లోనే 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.