సినిమా టికెట్ల ధరల పెంపు పై కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Issues Key Orders on Hike in Movie Ticket Prices

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు ఇచ్చిన అనుమతులపై రాష్ట్ర హైకోర్టు నేడు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలోనే ‘అఖండ 2’, ‘రాజా సాబ్’ చిత్రాల సమయంలో టికెట్ ధరల పెంపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి మెమోలు జారీ చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మళ్ళీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి అదనపు ధరల అనుమతులు ఇచ్చినందుకు గాను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్‌కు హైకోర్టు సుమోటోగా (స్వచ్ఛందంగా) కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

ఇక సినిమా టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న గందరగోళానికి తెరదించుతూ జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తే, ఆ నిర్ణయాన్ని సినిమా విడుదల కావడానికి కనీసం 90 రోజుల ముందే ప్రకటించాలని స్పష్టం చేసింది.

ఒకవైపు సినిమాటోగ్రఫీ మంత్రి టికెట్ ధరలు పెంచబోమని బహిరంగంగా చెబుతుంటే, అధికారులు మాత్రం అర్థరాత్రి పూట లేదా కోర్టుకు సెలవులు ఉన్న సమయంలో హడావుడిగా మెమోలు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. అధికారుల తీరు మంత్రి ఆదేశాలను లేదా కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం గౌరవించేలా లేదని ఆక్షేపించింది.

సినిమా టికెట్ ధరలను విపరీతంగా పెంచడం ద్వారా సామాన్యులకు సినిమాను ఒక విలాసవంతమైన వస్తువుగా మారుస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని కోర్టు అభిప్రాయపడింది. ‘తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్-1955’ ప్రకారమే ధరల నిర్ణయం ఉండాలని సూచించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.