రైజింగ్ కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న సినిమా జెట్లీ. విమానంలో జరిగే ఫన్ & యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. మత్తు వదలరా & మత్తు వదలరా 2 తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రితేష్ రానా ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా , క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదలచేయనున్నారు. ఈసినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.వెన్నల కిషోర్ , అజయ్ ఇందులోప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్. రితేష్ రానా సిగ్నేచర్ ఎంటర్టైన్మెంట్, క్లెవర్ రైటింగ్, యూనిక్ క్యారెక్టర్స్ తో జెట్లీ అలరించబోతుంది.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























