సంక్రాంతి రేస్ లో చివరి సినిమాగా విడుదలై ఆద్భుతమైన వసూళ్లతో లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి. కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి క్లీన్ హిట్గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజులు ముగిసేసరికి రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బయ్యర్లందరినీ లాభాల్లోకి చేర్చింది.అటు అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటికే 600k డాలర్లను క్రాస్ చేసి 1 మిలియన్ వైపు దూసుకుపోతోంది. అక్కడ పంపిణీదారులకు ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
ప్రస్తుత వసూళ్ల ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా లాంగ్ రన్లో నిర్మాతలకు మరిన్ని లాభాలను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈసినిమాలో సంయుక్త ,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశాడు. కామెడీ ప్రధానంగా వచ్చిన ఈసినిమా యూత్ తో పటు ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























