అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం

Allari Naresh’s Grandfather Passes Away

ప్రముఖ దర్శకుడు దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నటులు ఆర్యన్ రాజేష్ మరియు అల్లరి నరేష్‌లకు తాతగారైన ఈదర వెంకట్ రావు (90) సోమవారం (జనవరి 19, 2026) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తన నివాసంలోనే కన్నుమూశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకట్ రావుకు ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.ఆయన పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందారు. రెండో కుమారుడు ఇ.వి.వి. గిరి, మూడో కుమారుడు ఇ.వి.వి.శ్రీనివాస్ కాగా, కుమార్తె ముళ్ళపూడి మంగాయమ్మ.వెంకట్ రావు భార్య వెంకటరత్నం గారు 2019లోనే మరణించారు. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ మరియు ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంకట్ రావు పార్థివ దేహానికి నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆయన మృతి పట్ల టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఈదర కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.