అమెరికాలో అదరగొడుతున్న నారీ నారీ నడుమ మురారి

Sensational Run for Nari Nari Naduma Murari in the USA

హీరో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద తన సక్సెస్ పరంపరను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం అమెరికాలో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ మార్కును అధిగమించి, శర్వానంద్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వీకెండ్‌లో తెలుగు వారు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు.

రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ మరియు ‘అనగనగా ఒక రాజు’ వంటి భారీ చిత్రాల పోటీలోనూ ఈ సినిమా సాలిడ్ గా వసూళ్లు రాబట్టుకుంటుంది. దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది. 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.