ఆకాశంలో ఒక తార నుండి హీరోయిన్ గ్లింప్స్ రిలీజ్

Heroine Glimpse Released from Aakashamlo Oka Tara

సీతారామం, లక్కీ భాస్కర్ లతో తెలుగులో వరుసగా భారీ విజయలను అందుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ ఆకాశంలో ఒక తార అనే సినిమాతో రానున్నాడు. పవన్ సాదినేని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా గీతా ఆర్ట్స్ , వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నాయి.ఇక ఈరోజు ఈసినిమా హీరోయిన్ ను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమా ద్వారా సాత్విక వీరవల్లి అనే తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది.మారుమూల గ్రామంలో పుట్టిన తను ఆకాశంలోకి వెళ్లాలనే కలలు కనడం, మరి ఆ కల ఎలా నెరవేరింది, అందుకోసం హీరో ఏంచేశాడు అనే కథ తో వస్తుంది ఈ సినిమా.గ్లింప్స్ చూస్తుంటే మొదటి సినిమాతోనే సాత్విక మెమరబుల్ రోల్ సొంతం చేసుకున్నట్లు వుంది. దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా మలుస్తున్నారని తాజా విజువల్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

ఈ గ్లింప్స్ వీడియోలో, పల్లెటూరి నేపథ్యంలో సాత్విక వీరవల్లి లుక్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.అచ్చతెలుగు అమ్మాయిలా ఆమె కనిపించిన తీరు, అలాగే జీవీ ప్రకాష్ కుమార్ మెలోడియస్ మ్యూజిక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ స్టార్ సరసన ఒక తెలుగు అమ్మాయి నటిస్తుండటం సినిమాకు కొత్త శోభను తెచ్చింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుందని ఈ వీడియోలోని ప్రతి ఫ్రేమ్ చెబుతోంది.

గీతా ఆర్ట్స్ మరియు స్వప్న సినిమా నిర్మాణ విలువలు ఈ గ్లింప్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.దుల్కర్ ట్రాక్ రికార్డుతో ఈసినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.వేసవిలో ఈసినిమాను పాన్ ఇండియా భాషల్లో విడుదలచేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.