మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు.ఇందులో సునీల్ కామెడీ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.చాలా రోజుల తరువాత సునీల్ తన హాస్యం తో నవ్వించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మీట్ లో సునీల్ మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. ఈ సంక్రాంతికి నలుగురు నవ్వించే అవకాశం ఈ సినిమాలో నాకు వచ్చింది. రవితేజ గారితో నాకు ఎప్పటినుంచో చాలా మంచి ఫ్రెండ్షిప్. తను అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎవరి టైం వేస్ట్ చేయరు. ఆయన మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ ఎవరూ టచ్ చేయలేరు. చాలా రోజుల తర్వాత నా కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసామని నా ఫ్రెండ్స్ భీమవరం నుంచి ఫోన్ చేసి చెప్పారు. సుధాకర్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్. ఆయనకి ఎప్పుడూ మంచి పేరు డబ్బులు రావాలని కోరుకుంటాను. రవితేజ గారు రేస్ కారు. ఆ రేస్ ని ఫ్యామిలీ ట్రాక్ లో పెట్టి డైరెక్టర్ కిషోర్ తిరుమల అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























