టాలీవుడ్ హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్ కి సంక్రాంతి సీజన్ మరో సారి భారీ విజయాన్ని అందించింది. గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వాకి ఈ సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారి ఆ విజయాన్ని అందించింది.సంక్రాంతి సినిమాల్లో చివరిది గా విడుదలైన ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. మిగితా సినిమాలతో భారీ పోటీ ఉన్నప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు శర్వా 2016 సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజా తో అలాగే 2017 సంక్రాంతికి శతమానం భవతి సినిమాలతో రాగ ఈ రెండు భారీ విజయాలను అందుకున్నాయి. శతమానం భవతి అయితే శర్వా కేరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృస్టించింది. ఇక ఇన్ని ఏళ్ళ తరువాత శర్వా నారీ నారీ నడుమ మురారి తో మళ్ళీ సంక్రాంతి బరిలో నిలిచి మరో విజయాన్ని అందుకున్నాడు. అలా శర్వా సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. మొత్తానికి శర్వానంద్ కి సంక్రాంతి సెంటిమెంట్ మరో సారి బాగా వర్క్ అవుట్ అయ్యింది..
రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈసినిమాలో కామెడీ ప్రధానంగా హైలైట్ అయ్యింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈసినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టుకోనుంది.సంయుక్త మీనన్ , సాక్షి వైద్య కథానాయికలుగా నటించిన ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు.ఈసినిమాతో నిర్మాత కూడా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























