నవీన్ పొలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన సంక్రాంతి మాస్ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. చిత్ర నిర్మాణ సంస్థ మరియు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 41.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి నవీన్ పొలిశెట్టి కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి రోజు సుమారు రూ. 22 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఖాతా తెరిచిన రాజు గారు, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల్లో సుమారు రూ. 10.16 కోట్ల షేర్ (రూ. 18 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా నవీన్ తన సత్తా చాటుతూ రెండు రోజుల్లోనే సుమారు రూ. 3.42 కోట్ల షేర్ సాధించారు.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ. 28 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు రోజుల్లోనే రూ. 14.16 కోట్ల షేర్ సాధించినందున, రాబోయే వారాంతంలో అన్ని ఏరియాల్లో లాభాల్లోకి రానుంది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, మీనాక్షి చౌదరి గ్లామర్ మరియు సంక్రాంతి పండుగకు విడుదలకావడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ మరోసారి తన మార్కు ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను కట్టిపడేశారు.
ఇక ఈసినిమాతో నవీన్ కెరీర్ లో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు నిర్మాత నాగవంశీ కూడా వరుసగా రెండు పరాజయాల తరువాత అనగనగా ఒక రాజు తో కం బ్యాక్ ఇచ్చాడు. మారి దర్శకత్వంలో ఫన్ & ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.ఫుల్ రన్ లో ఈసినిమా 100 కోట్ల మార్క్ టచ్ చేసే ఛాన్స్ లేకపోలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























