నారీ నారీ నడుమ మురారి అనేది థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడికి ఒక చిల్ & ఫీల్-గుడ్ అనుభూతిని ఇచ్చే హిలేరియస్ ఎంటర్టైనర్. సరైన మోతాదులో కామెడీకి ఎమోషన్‌ను జోడించి, ఎక్కడా బోర్ అనిపించకుండా కథను నడిపించిన విధానం సినిమాకు ప్రధాన బలం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక లైట్, సరదా వైబ్‌తో సాగుతుంది. ముఖ్యంగా నరేష్ పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. అతని క్యారెక్టర్ చుట్టూ వచ్చే సన్నివేశాలు థియేటర్లో నవ్వుల జలపాతాన్ని తెరలేపాయి.
శర్వానంద్ ఈ సినిమాలో ఎనర్జిటిక్, నేచురల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. అతని కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను ముందుకు నడిపిస్తాయి. సాక్షి వైద్యతో శర్వానంద్ లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్‌లో చాలా క్యూట్‌గా, ఫీల్-గుడ్‌గా ఉంటుంది.
సంపత్, సమ్యుక్త తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయి కథకు బలాన్ని చేకూర్చారు.
ఫస్ట్ హాఫ్‌లో శర్వా–సాక్షి లవ్ ట్రాక్‌తో పాటు నరేష్ రెండో పెళ్లి ఎపిసోడ్ ఆడియన్స్ నుంచి పెద్ద నవ్వులు రాబట్టింది.
సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిషోర్–సంపత్ కామెడీ ట్రాక్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే శ్రీ విష్ణు క్యామియో ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్గా ప్రేక్షకులను అలరిస్తుంది.
రామ్ అబ్బరాజు రైటర్‌గా, డైరెక్టర్‌గా మరోసారి తన స్ట్రెంగ్త్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. కామెడీని ఎక్కడా ఓవర్ చేయకుండా, సిట్యుయేషనల్ హ్యూమర్‌తో సినిమాను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దాడు.అనిల్ సుంకర చేసిన స్మార్ట్ ప్రమోషన్స్ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చాయి.
ఫైనల్‌గా, నారీ నారీ నడుమ మురారి అనేది నవ్వులు, రిలేషన్షిప్ డ్రామా, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉన్న ఒక పక్కా థియేట్రికల్ ఎంటర్టైనర్. #MSVPG తర్వాత థియేటర్లో అంతగా నవ్వులు తెప్పించిన సినిమాల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























