నారీ నారీ నడుమ మురారి నుండి వీడియో సాంగ్ రిలీజ్ 

Aa Nari Ee Nari Video Song from Nari Nari Naduma Murari out now

యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ నుండి తాజాగా “ఆ నారి ఈ నారి”  అనే ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఇదే పేరుతో ఉన్న క్లాసిక్ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో మొదటి నుంచీ దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం విడుదలైన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో  ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాటలో శర్వానంద్ ఇద్దరు కథానాయికలు సంయుక్త మరియు  సాక్షి వైద్య  మధ్య చిక్కుకున్న ఒక సరదా పరిస్థితిని చూపించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. రేపు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శర్వానంద్ మార్కు కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.