మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది మామూలుగా లేదు. ఆయన రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే. నేను మా తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ తో మహేష్ తో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. అనిల్ తో నాది వండర్ఫుల్ కాంబినేషన్. అన్ని సినిమాలు మీరు సూపర్ హిట్ చేశారు. తన రైటింగ్ టీం. టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























