మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నాకు తొమ్మిదో సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ సినిమాకు పనిచేసిన రైటర్స్ కి థాంక్యూ. నిర్మాతలు సాహు గారికి సుస్మిత గారికి థాంక్యూ. సాహు గారితో నాకు ఇది రెండో సినిమా. సుస్మిత గారు హాట్సాఫ్. మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. భీమ్స్ తన మ్యూజిక్ తో సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చారు. మీసాల పిల్ల పెద్ద హిట్. అక్కడినుంచి ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది.నయనతార గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా కోసం రెండు ప్రమోషన్స్ కూడా చేశారు. విక్టరీ వెంకటేష్ గారు ఫ్రెండ్, గైడ్. టెక్నికల్ గా వెంకటేష్ గారితో ఇది నాలుగో సినిమా. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. వెంకీ గారు ఈ సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు. నేను ఈ కథ చెప్పిన తర్వాత ఈ ఆలోచన ఇచ్చింది చిరంజీవి గారే. చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్ మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. వెంకీ గౌడ గా కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నారు. చిరంజీవి గారు వెంకటేష్ గారిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉంది ఎన్నో ఏళ్ల కల. అది నాకు కుదిరింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఒక కన్నుల విందు ఇవ్వాలనేది వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. తెలుగు సినిమా చరిత్రలో వారి కాంబినేషన్ మెమొరబుల్ గా మిగిలిపోతుంది. చిరంజీవి గారు 150 పైగా సినిమాలు చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్, పద్మ భూషణ్, పద్మ విభూషణ్.. ఇలా ఒక మనిషి ఎన్ని సాధించాలో అంతా ఉన్నత స్థాయి సాధించారు. కానీ చాలా గ్రౌండ్ గా, హంబుల్ గా ఉంటారు. అలా ఎలా ఉంటారో అనేది నాకు అర్ధం కాదు. ఆయనతో గడిపిన ఈ ఆరు నెలల జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను.
ఇది నాకు ఒక నాస్టాలజికి ఫీలింగ్. ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మాకు పెట్టారు. ఒక హీరోగా ఆయన నాకు నమ్మి అవకాశం ఇచ్చినందుకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటి లెజెండ్రీ హీరోతో నేను పని చేసినందుకు చాలా ఆనందంగా నేను ఫీల్ అయ్యాను.ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనుకుంటున్నారు కానీ అంతకుమించి ఎమోషనల్ డ్రామా ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ డాన్స్ సాంగ్స్, వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అల్లరి.. ఇలా ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. చిరంజీవి గారు వెంకటేష్ గారితో కలిసి ఈ సంక్రాంతికి రాబోతున్నాను. నా ప్రతి సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ. వాళ్ళు లేకపోతే నేనులేను. కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం. క్రిటిసిజం తట్టుకుని ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ మీ ముందుకు తెచ్చి మీ ఆదరణ పొందడం అనేది పెద్ద ప్రాసెస్. ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నామంటే అది ఆడియన్స్ వళ్ళనే. ఫ్యామిలీ జోనర్ కి ఇంత బలం ఉందని నిరూపించిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. చిరంజీవి గారికి ఎన్నో అద్భుతమైన విజయాలు వున్నాయి. అలాంటి అద్భుతమైన విజయాలు జాబితాలో ఈ సినిమా కూడా జాయిన్ అవ్వాలని నా చిరు కోరిక. ఆ కోరికనే మీరందరూ నెరవేరుస్తారని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సంక్రాంతికి వస్తున్న ప్రభాస్ గారి సినిమా, రవితేజ గారి సినిమా, నవీన్, శర్వా అన్ని సినిమాలకి నా బెస్ట్ విషెస్. జనవరి 12 నుంచి మన శంకర వరప్రసాద్ గారు మీ థియేటర్స్ కి వచ్చేస్తున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి అందరికీ థాంక్యు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























