మన శంకర వర ప్రసాద్ గారు ఆల్రెడీ సూపర్ హిట్ – మెగాస్టార్ చిరంజీవి

Mana Shankara Vara Prasad Garu Is Already a Super Hit Says Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా..అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్రం పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను.అలంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నది. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేటర్స్ లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి.

రాఘవేంద్రరావు గారు, అనిల్ తో నేను సినిమా చేస్తే అది అదిరిపోతుందని చాలా సంవత్సరాల క్రితం అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఘరానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు .. ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి .ఈ సినిమాని వైవిధ్యంగా చేస్తామని తనతో చెప్తే…’ ఎలాంటి వైవిధ్యం వద్దండి.. దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు అన్నయ్య, చంటబ్బాయి… ఈ సినిమాలన్నీ ఎలా ఉన్నాయో నాకు అలా ఉంటే చాలు అన్నారు. అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూశారు. వాళ్లంతా పెద్దవాళ్ళు అయిపోయారు.అవి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ కి అవి మీరు ఎలా చేస్తారు కూడా తెలియకపోవచ్చు .అదంతా ఈ జనరేషన్ తెలియజేసే నా ప్రయత్నం అన్నారు. అప్పుడు నేను సరే అన్నాను. అలా చేయడం నాకు కేక్ వాక్. చాలా చక్కటి హోం వర్క్ చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అద్భుతంగా సీన్స్ ని డిజైన్ చేస్తూ వచ్చారు. తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదా సరదాగా జరిగింది.అనిల్ రావిపూడి అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కేక్ వాక్ లాగా చేయగలరు. సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్‌ విషయంలోనూ అనిల్‌ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడు.

ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. బడ్జెట్ లిమిట్లో చేసాం. డేస్ పరంగా అనుకున్న దాని కంటే తక్కువ రోజుల్లో అత్యద్భుతంగా తీగలిగాం. అనుకున్న బడ్జెట్లో అనుకున్న రోజుల్లో సినిమాచేయగలగడం ఒక సినిమాకి మొదటి సక్సెస్. రెండో విజయం 12 తారీఖున ఎంత ఘన విజయం ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. నా తమ్ముడు వెంకటేష్ తో సినిమా చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. వెంకటేష్ చాలా పాజిటివ్ పర్సన్. తనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్ గా అనిపిస్తుంది. మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మేము చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిల్ ఫోటో దిగడం జరిగింది. మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. అనిల్ ద్వారా ఎన్నాళ్లకు అది కుదిరింది. అనిల్ రావిపూడి మాత్రమే దానికి జస్టిఫికేషన్ చేయగలిగాడు. మా కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరు థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. వెంకీ నేను ఇద్దరం చాలా ఎంజాయ్ చేశాం. ఇది యాక్టింగ్ చేసినలా ఉండదు. ఇద్దరు కుర్రాళ్ళు కలిసి అల్లరి చేసినట్టుగా ఉంటుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి పూర్తిస్థాయి న్యాయం చేసి మరో సినిమాని నెక్స్ట్ తీసుకెళ్లడానికి దోహదపడిన వెంకటేష్ కి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి మేము ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎంత ఊహించుకున్న తక్కువే అవుతుంది. అనిల్ మాట్లాడుతూ మనిద్దరం ఫుల్ లెంత్ ఒక సినిమా చేస్తే బాగుంటుందన్నారు. అలాంటి ఒక కథ రాసుకుంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

నయనతార ఈ సినిమా కోసం తను కూడా మాకు కుటుంబ సభ్యురాలు లాగా కలిసిపోయింది. ఈ సినిమాలో నయనతార కనిపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. తను అద్భుతంగా నటించి మెప్పించింది. నటీనటులు అందరూ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్లందరికీ నా అభినందనలు.ఈ సినిమాకి బీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఒక గోదావరి పడవ ప్రయాణం లాగా ఉండే మ్యూజిక్ ఇచ్చాడు. మీసాల పిల్ల సాంగ్ వంద మిలియన్ పైగా హిట్ ఇచ్చింది. పాటలో లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో హుక్ స్టెప్ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. థియేటర్లో ఆ సాంగ్ టోటల్ గా హైలైట్ అవుతుంది. ఆ సాంగ్ వింటున్న వెంకటేష్ ఎదురుగా డాన్స్ వేశారంటే అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను.ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన బీన్స్ కి అభినందనలు. నేను అంత అందంగా కనిపించడానికి మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు కారణం, చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తను చాలా ఫాస్ట్ కెమెరామెన్. కాఫీ తాగే గ్యాప్ కూడా ఇవ్వరు కాబట్టే సినిమా 88 రోజుల్లో పూర్తయింది. ఆయన లాంటి కెమెరామెన్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ కి ఖర్చు తగ్గుతుంది ప్రొడక్షన్ డిజైన్ ప్రకాష్ చాలా చక్కగా చూపించారు. సాహు గారు అందర్నీ చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు. చాలా మంచి ప్రొడ్యూసర్. తనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా బిడ్డ సుస్మిత… తను ఇండస్ట్రీకి వస్తానని చెప్పినప్పుడు కష్టపడి పని చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పాను. తను అదే మాట ప్రకారం నిరంతరం కష్టపడుతూ పనిచేసింది. ఈ సినిమా కూడా సాహూ గారితో కలిసి తను నిర్మాణం చేసింది. తన అన్ని కంఫర్ట్ ని వదులుకొని చాలా హార్డ్ వర్క్ చేసింది. సాహు, తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాంటి హిట్ తండ్రిగా నాకు ఇచ్చినందుకు తను గర్వపడుతుంది. ఈ పరిశ్రమలో నాకు అన్ని రకాలుగా భుజం కాస్తూ ఇంటికి పెద్ద బిడ్డ అయినందుకు ఆ పెద్దరికన్ని సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా తాను చేదోడు వాదోడుగా ఉంది. రామ్ చరణ్ తో పాటు తను నాకు మరో బిడ్డ. ఇదే కష్టాన్ని నమ్ముకోండి. కచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేస్తాడు. ప్రతి ఒక్కరు ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉండాలి. నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి లోకి వస్తారని నాకు తెలుసు. ఇదే అభిమానం ప్రేమ మీరు ఎప్పుడూ నా మీద చూపించాలి. థాంక్యూ సో మచ్. ఐ లవ్ యు ఆల్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.