యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘U/A ‘ సర్టిఫికేట్ జారీ చేసింది.ఈ సినిమా రన్ టైమ్ సుమారు 145 నిమిషాలుగా లాక్ చేయబడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిల మధ్య పడి ఎదుర్కొనే సరదా ఇబ్బందులు, కుటుంబ భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుండి లభించిన పాజిటివ్ రిపోర్ట్ శర్వానంద్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఒక్క కట్ కూడా లేకుండా రానున్నడం, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ప్లస్ పాయింట్ కానుంది.
ఇందులో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. శ్రీ విష్ణు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటల నుండి షోలు ప్రారంభం కానున్నాయి.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడుతున్నప్పటికీ, కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడం తో నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడతారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























