జన నాయకుడు విడుదల వాయిదా

Jana Nayakudu Release Postponed

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’  విడుదల వాయిదా పడింది. సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రావడంలో జాప్యం జరగడంతో, జనవరి 9న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని చిత్ర యూనిట్ ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత రెండు రోజులుగా సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. సెన్సార్ సభ్యులు సూచించిన కట్స్ మరియు మార్పులను పూర్తి చేసి మేకర్స్ తిరిగి పంపించినప్పటికీ, సర్టిఫికేట్ మంజూరులో జాప్యం జరిగింది. దీనిపై నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, బుధవారం జరిగిన వాదనల అనంతరం కోర్టు తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసుపై తుది తీర్పును జనవరి 9న ప్రకటించనున్నారు.

కోర్టు తీర్పు వెలువడే వరకు సినిమాను విడుదల చేయడానికి వీలు లేకపోవడంతో, మేకర్స్ విధిలేక విడుదల తేదీని వాయిదా వేశారు. కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు వారి నగదును వెనక్కి ఇచ్చేస్తామని చెన్నైలోని థియేటర్ యాజమాన్యాలు మరియు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ‘ఆర్.ఎఫ్.టి ఫిల్మ్స్’ అధికారికంగా వెల్లడించారు.

కోర్టు తీర్పు శుక్రవారం సినిమాకు అనుకూలంగా వస్తే, సెన్సార్ బోర్డు అదే రోజు లేదా శనివారానికల్లా సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. విజయ్ రాజకీయ ప్రయాణానికి ముందు వస్తున్న ఆఖరి సినిమా కావడంతో, కావాలనే దీనిని అడ్డుకుంటున్నారని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.