టాక్సిక్ నుండి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

Rukmini Vasanth First Look Released from Toxic

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుండి వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్న చిత్ర యూనిట్, తాజాగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్  ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో ఆమె ‘మెలిస్సా’  అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. విడుదలైన పోస్టర్‌లో రుక్మిణి వసంత్ ఒక విభిన్నమైన మరియు మోడ్రన్  లుక్‌లో కనిపిస్తున్నారు. ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో తన నటనతో అందరినీ మెప్పించిన ఈమె, ఇప్పుడు యష్ సరసన ఒక బలమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర సినిమా కథా గమనంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా నుండి నయనతార (గంగ), కియారా అద్వానీ (నదియా) పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇది 1970 – 80ల నాటి గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

యష్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నది. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోయిన్లందరికీ కథలో సమాన ప్రాధాన్యత ఉంటుందని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఇప్పటికే వెల్లడించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.