చార్మింగ్ స్టార్ శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భోగి. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.1960 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ప్రారంభమయ్యింది. ఈ కీలక షెడ్యూల్ లో టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు.ఈ సినిమాలో శర్వా నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నారు.అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా గా నటిస్తున్నారు.1960ల ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్ తో ‘భోగి’ టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక శర్వానంద్ ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో వస్తున్నాడు.రామ్ అబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా జనవరి 14న విడుదలకానుంది.ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సంయుక్త ,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈసినిమా తో శర్వా హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























