ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల’ ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగులో ఇప్పటికే సూపర్ హిట్ అనిపించుకున్న ఈసినిమా హిందీలో కూడా రిలీజ్ కానుంది. ఈనెల 9న శంబాల నార్త్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలోని యూనివర్సల్ అప్పీల్ మరియు మిస్టరీ ఎలిమెంట్స్ ఉత్తరాది ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతాయని భావించిన మేకర్స్, దీనిని పాన్ ఇండియా స్థాయిలో హిందీలోకి డబ్ చేశారు. హిందీ వెర్షన్ హక్కులను ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఉత్తరాది మార్కెట్లో ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈసినిమా హిందీలో ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో చూడాలి.
జియో సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో ఆది సాయికుమార్ నటన మరియు హిమాలయాల నేపథ్యంలో సాగే శంబాల రహస్యాల కథ హిందీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక తెలుగులో ఈసినిమా నిన్నటి వరకు 20కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది. ఎట్టకేలకు ఈసినిమాతో ఆది సాయి కుమార్ కం బ్యాక్ ఇచ్చాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























