ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత రసవత్తరంగా మారింది. పండగ రేసులో ఈసారి తమిళ డబ్బింగ్ సినిమాలతో కలిపి ఏకంగా 7 సినిమాలు బరిలో నిలిచాయి. ఇందులో 4 సినిమాల ట్రైలర్లు కూడా విడుదలయ్యాయి.ఇక నెక్స్ మరో రెండు క్రేజీ చిత్రాలైన మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మరియు యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాల ట్రైలర్లు ఒకే రోజున విడుదల కానున్నాయి.ఈ రెండు సినిమాల ట్రైలర్లు జనవరి 7న రిలీజ్ అవ్వనున్నాయి. దాంతో ఈ ట్రైలర్ల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ రెండు సినిమలపై కూడా మంచి అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భర్త మహాశయులకు విజ్ఞప్తి లో రవితేజ హీరోగా నటించగా కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశాడు.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం అలాగే రవితేజ తన కెరీర్లో చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తుండడం తో సినిమా కు మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించగా ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు.
మరోవైపు, నవీన్ పోలిశెట్టి మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి.మారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక హిలేరియస్ వెడ్డింగ్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది.నవీన్ పోలిశెట్టి టైమింగ్ మరియు గోదావరి యాస ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా జనవరి 14న ఈసినిమా థియేటర్లలోకి రాబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























