మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఇందుకోసం ట్రైలర్ లాంచ్ వేడుకను ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని ఎస్వీ సినీ ప్లెక్స్‌లో భారీ ఎత్తున నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 2 నిమిషాల 35 సెకన్ల నిడివితో వచ్చిన ఈట్రైలర్ అదిరిపోయింది.అనిల్ రావిపూడి మార్క్ ఫన్ తోపాటు మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉంది. ట్రైలర్ చివర్లో వెంకటేష్ ను కూడా చూపెట్టారు.సినిమాలో చిరు , వెంకీ ల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోనున్నాయట. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’, మరియు ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ చార్ట్ బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేశాయి.
ఈసినిమాలో ,చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవనున్నారు.అలాగే క్యాథరిన్ ట్రెసా, సునీల్, వీటీవీ గణేష్ మరియు అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రమోషన్ల విషయంలో కూడా అనిల్ రావిపూడి ఏమాత్రం తగ్గకుండా సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.అనిల్ ట్రాక్ రికార్డు కి తోడు పండుగ సీజన్‌లో విడుదలకానున్నడం అలాగే ఫ్యామిలీ ఆడియన్సు సపోర్ట్ ఉండడంతో మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్ గా నిలువడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























