మన శంకరవరప్రసాద్ గారు మెగా రైడ్ లా ఉంటుంది – అనిల్ రావిపూడి

Mana Shankara Vara Prasad Garu Will Be Like a Mega Ride Says Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మన శంకర వర ప్రసాద్ గారు తో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రమోషన్‌లు ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లింప్స్, పాటలు, పోస్టర్ అంచనాలను పెంచాయి. ఇక నిన్న ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంటు. ప్రతి సినిమా రిలీజ్ కి ఇక్కడికి వస్తాను. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను. ఆయన దయవలన కెరీర్ చాలా హ్యాపీగా ఉంది. అలాంటి తిరుపతిలోనే ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలి అనుకుంటున్నానో, ఆయన నాకు ఎలా ఇష్టమో, ఆయనలో నాకు ఏం నచ్చుతాయి అనే ఆలోచనతో ఈ కథని రాసుకున్నాను. దానికి తగ్గ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ ట్రైలర్ లో చూసింది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. సినిమా చూసిన తర్వాత ఒక టైం మిషన్ ఎక్కి ఒక రౌండ్ వేసి వస్తారు. అది మాత్రం గ్యారెంటీ. చిరంజీవి గారు లీడర్ రాజు, ఆటో జానీ.. ఇలాంటి క్యారెక్టర్స్ లో ఆయన మనకు విపరీతంగా నచ్చుతారు. నేను ఆ అలాంటి బేసిస్ లోనే ఈ శంకర వరప్రసాద్ క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. చిరంజీవి గారిలో ఉన్న ఫన్ టైమింగ్ నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం. నేను రాసిన దాని కంటే చిరంజీవి గారు దాన్ని వంద రెట్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రజెంట్ చేశారు. ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు.మీసాల పిల్ల 100 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇంకా అద్భుతంగా వెళుతుంది.

అలాగే శశిరేఖ సాంగ్, వెంకటేష్ గారితో చిత్రీకరించిన పాట అన్ని పాటలు కూడా మాస్ కి యూత్ కి ఫ్యామిలీ కి అందరికి నచ్చుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం నా కెరీర్ లో స్పెషల్ ఫిలిం. ఆ సినిమాని మీరందరూ థియేటర్స్ లో అద్భుతంగా సెలబ్రేట్ చేశారు. ఇది నా నాలుగో సంక్రాంతి సినిమా. తప్పకుండా మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు. ఎక్స్ ట్రార్డినరీ ఉందని చెప్పారు. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ సంతోషంతో బయటికి వస్తారు. చిరంజీవి గారి అభిమానులు కళ్యాణ్ బాబు గారి అభిమానులు చరణ్ గారి అభిమానులు, అందరూ స్టార్ ఫ్యాన్స్.. ఎక్కడో ఒకచోట చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యే ఉంటారు. అందరూ వచ్చి ఈ సినిమా చూడండి. మెగాస్టార్ సెలబ్రేట్ చేసుకోండి. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఫ్రెండ్స్ లా కలిసిపోయి పని చేశారు. ఆ ఇద్దరు స్టార్స్ ని ఒకే ఫ్రేంలో చూడటం పండగలా వుంటుంది. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మెగా రైడ్ ఉండబోతుంది. నయనతార గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. ఈవెంట్ ఎంత అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. జనవరి 12 మళ్లీ నవ్వుకుందాం.. మళ్ళీ ఎంజాయ్ చేద్దాం.. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.