మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు.ఇందులో మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనుండడం తో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈ సినిమా నుండి ఈరోజు మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.గుంటూరు లోని విజ్ఞాన్ యూనివర్సిటీ లో ఈ సాంగ్ ను లాంచ్ చేశారు. ‘మెగా-విక్టరీ మాస్ సాంగ్’ గా వచ్చిన ఈపాట అదిరిపోయింది.ఈ మాస్ సాంగ్ లో చిరు ,వెంకీ వేసిన స్టెప్పులు అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం.కలర్ ఫుల్ విజువల్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి , ఇద్దరు అగ్ర హీరోలను ఈపాటలో మాస్ స్టెప్పులతో చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మాస్ నంబర్‌కు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఊహించని విధంగా చార్ట్ బస్టర్స్ అనిపించుకోగా ఈ మూడో సాంగ్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనుంది.ఇలా విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమా కూడా పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేలావున్నారు.
ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా క్యాథెరిన్ ట్రెసా ,మురళి ధర్ గౌడ్ , వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























