సూర్య 46 స్టోరీ లైన్ రివీల్ చేసిన నిర్మాత నాగవంశీ 

Producer Naga Vamsi Reveals the Storyline of Suriya 46

తమిళ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ రైజింగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సూర్య 46.ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌ను నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో  వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఒక విభిన్నమైన మరియు సున్నితమైన ప్రేమకథ నేపథ్యంతో సాగుతుంది.ఇందులో 45 ఏళ్ల వయసున్న వ్యక్తి (సూర్య) 20 ఏళ్ల యువతి (మమితా బైజు) మధ్య ఏర్పడే సంబంధాన్ని, వారి మధ్య ఉండే అనుబంధం మరియు భావోద్వేగాలను దర్శకుడు చూపించబోతున్నారు.ఇంత భారీ వయసు వ్యత్యాసం ఉన్న ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమలో పడగలరా? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ కథ తిరుగుతుంది.ఈ సినిమాలో సూర్య పాత్ర గతంలో ఆయన నటించిన ‘గజిని’లోని సంజయ్ రామస్వామి తరహాలో చాలా హుందాగా, ఇంటెన్స్‌గా ఉంటుందని నిర్మాత వెల్లడించారు.

 పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్  గా తెరకెక్కుతున్న ఈసినిమాలో  ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్  దాదాపుగా పూర్తయింది.2026 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

అయితే ఈసినిమా కన్నా ముందు సూర్య కరుప్పు తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతుంది.జనవరి చివర్లో లేదా  ఫిబ్రవరి లో రిలీజ్  చేయాలని చూస్తున్నారు. ఇందులో  త్రిష హీరోయిన్ గా నటించగా డ్యూడ్ ఫేమ్ సాయి అభ్యంకర్  సంగీతం అందిస్తున్నాడు. 2 డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.