ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ శంబాల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకుంటూ హిట్ దిశగా దూసుకుపోతుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో సూపర్ వసూళ్లను సాధించింది.రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 5.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని మేకర్స్ ప్రకటించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కొన్ని చోట్ల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. మొదటి రోజు రూ. 3.30 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా స్టడీగా వసూళ్లను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కలెక్షన్స్ వివరాలు:
మొదటి రోజు (గురువారం): రూ. 3.30 కోట్లు
రెండో రోజు (శుక్రవారం): రూ. 1.85 కోట్లు
మొత్తం (2 రోజులు): రూ. 5.15 కోట్లు
సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలయికతో సాగే ఈ కథలో ఆది సాయికుమార్ తన కెరీర్‌లోనే పరిణతి చెందిన నటనను కనబరిచారనే ప్రశంసలు దక్కుతున్నాయి. విక్రమ్ అనే జియోసైంటిస్ట్ పాత్రలో ఆయన నటన, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియన్స్ నుండి వస్తున్న పాజిటివ్ టాక్, ఈ వీకెండ్ వసూళ్లకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఈసినిమాకు ఛాంపియన్ అలాగే ఈషా సినిమాలతో గట్టి పోటీ ఎదురవుతుంది. లేకుంటే శంబాలా కలెక్షన్స్ ఇంకా పెరిగేవే. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, మధునందన్, రవివర్మ కీలక పాత్రల్లో నటించగా శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























