బాలీవుడ్ యాక్షన్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించి, ఈ ఘనత సాధించిన అతికొద్ది భారతీయ సినిమాల జాబితాలో చేరిపోయింది. దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రం,రణ్వీర్ సింగ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్లోనే విడుదలై ఈ ఫీట్ సాధించడం విశేషం.అంతేకాదు ఏ రేటెడ్ సర్టిఫికెట్ తో వచ్చి 1000కోట్ల మైలురాయి చేరుకున్న మొదటి సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ బాక్సాఫీస్ వద్ద నిన్నటి తో రూ. 685.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ‘ధురంధర్’, విదేశాల్లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. హాలీవుడ్ చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ఈ చిత్రం మూడో వారంలో కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతూ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఘనంగా ప్రవేశించింది. రణ్వీర్ సింగ్ నటన, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మరియు దేశభక్తి అంశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి.
ఈ చిత్రంతో రణ్వీర్ సింగ్ తన మార్కెట్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల్లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’, ‘పఠాన్’ మరియు ఆమిర్ ఖాన్ ‘దంగల్’ వంటి సినిమాల సరసన ‘ధురంధర్’ నిలిచింది.ఈ భారీ విజయంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ‘ధురంధర్ 2’ సీక్వెల్‌ను కూడా ప్రకటించింది. 2026 మార్చిలో విడుదల కానున్న ఈ సీక్వెల్‌పై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























