రోషన్ ను ఇంకో  సినిమా చేసి రమ్మని చెప్పాం – స్వప్న దత్

We Asked Roshan to Do One More Movie Before Champion Says Swapna Dutt

 స్వప్న సినిమాస్  నిర్మాణంలో  రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తో  సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. వైజయంతి మూవీస్ కి 50 ఇయర్స్. స్వప్న సినిమాస్  మొదలై కూడా 25 ఏళ్లు అవుతుంది. ఈ రెండు బ్యానర్స్ లో ఎప్పుడు కూడా మేము ఈజీ సినిమాలు చేయలేదు. ప్రతిసారి ఒక ఛాలెంజింగ్ గా ఉన్న కథలు ఎంచుకుని సినిమాలు చేస్తున్నాం. ఈ కష్టమైనా సినిమాల్లోనే ఒక తృప్తి ఉంది. డబ్బు అనేది అవసరమే కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా ముఖ్యం. అందుకే సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాం. కిరణ్ గారికి, జీకే, జి స్టూడియోస్ కి థాంక్యూ. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇందులో నటించిన అందరూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రదీప్ నాలుగేళ్ల క్రితం ఈ కథ చెప్పాడు. కథ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. ఈ కథకి హీరో ఎవరు అని చూస్తున్నప్పుడు అప్పుడు రోషన్ ఫోటో చూడడం జరిగింది. 

అప్పటికి ఇంకా యంగ్ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం మూడేళ్లు వెయిట్ చేశాడు. మేము అప్పుడు కల్కి చేస్తున్నాం. తనకి ఇంకో సినిమా చేసి రమ్మని చెప్పాం. కానీ తను ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తానని చెప్పాడు. అనస్వర చాలా చక్కగా నటించింది. ఈ సినిమాకి మరో హీరో మిక్కీ జే మేయర్. సినిమా రిలీజ్ కి ముందే పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈరోజు ఈ ఓపెనింగ్స్ రావడంలో తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచే కళ్యాణ్ చక్రవర్తి గారిని మేము సంప్రదించాం. అప్పటికి ఇంకా ఆయన చెన్నైలోనే ఉన్నారు. ఫైనల్ గా ఈ సినిమాలో  ఆయన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా సినిమాలో చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. మది గారు, చంటి గారు, పీటర్ మాస్టర్, తోట గారు..  టెక్నీషియన్స్. యాక్టర్స్ వీళ్లంతా కూడా ఈ సినిమాకి రియల్ ఛాంపియన్స్. రాత్రి పగలు కష్టపడి వర్క్ చేశారు. మా ప్రొడక్షన్ టీం కి థాంక్యూ. మేము ఎప్పుడు డిఫరెంట్ సినిమా చేసిన ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.