ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ – రోషన్ 

Roshan Thanks the Audience for the Huge Success of Champion

స్వప్న సినిమాస్  నిర్మాణంలో  రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తో  సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. మీడియా అందరికీ థాంక్యు సో మచ్. ఛాంపియన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. తనకి సినిమా అంటే చాలా పాషన్ సినిమా కోసం ఏమైనా చేస్తుంది. కిరణ్ గారికి థాంక్యూ, అలాగే జీకే గారికి, మా నిర్మాతలు అందరికీ థాంక్యూ సో మచ్. కళ్యాణ్ చక్రవర్తి గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పటినుంచి ఆయన నటన కొనసాగించాలని కోరుకుంటున్నాను. 

ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన మాకు ఒక ఇన్స్పిరేషన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మిక్కీ గారు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఆయన పాటలే చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్లాయి. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అనస్వర చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది. ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఛాంపియన్ ఎప్పటికీ నాకు స్పెషల్ ఫిలిం. నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్యూ. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా అందరికీ స్పెషల్. ఇది ఫ్యామిలీ మూవీ. అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.