పరాశక్తి విడుదల తేదీ మారింది

Parasakthi Gets a New Release Date

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన 25వ సినిమా పరాశక్తి విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని నాలుగు రోజుల ముందుగానే, అంటే జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు, సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మార్పుతో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా దళపతి విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న జన నాయగన్ జనవరి 9న విడుదలవుతుండగా, మరుసటి రోజే శివకార్తికేయన్ పరాశక్తి తో వస్తుండడంతో రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.

పరాశక్తి లో శ్రీలీల , జయం రవి, అథర్వ కీలక పాత్రల్లో నటించగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందింస్తున్నాడు. 1960ల నాటి రాజకీయ మరియు చారిత్రక అంశాల నేపథ్యంలో, ఒక విప్లవాత్మక విద్యార్థి పోరాట కథగా ఈ సినిమా రూపొందుతుంది.తెలుగులో కూడా ఈ చిత్రం అదే తేదీన (జనవరి 10) విడుదల కానుంది. సంక్రాంతి సీజన్‌లో తెలుగు నుండి 5 సినిమాలు బరిలోకి దిగుతుండడంతో పరాశక్తి ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.