ది ప్యారడైజ్ లో హీరోయిన్ ఫిక్స్ 

Heroine Confirmed for The Paradise

వైవిధ్యమైన కథలతో వరుస విజయాలను అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దసరా తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి. దానికి తగ్గట్లుగానే క్యాస్టింగ్ కూడా జరుగుతుండడంతో ఆ హైప్ డబుల్ అయ్యింది. అందులో భాగంగా మోహన్ బాబు ,రాహుల్ జ్యూయల్ ,సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో నటించగా ఇక ఇప్పుడు హీరోయిన్ ఎవరనేది కూడా రివీల్ అయ్యింది. గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కయాదు లోహర్ ఖరారయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని కయాదు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ, హార్ట్ ఎమోజీలను జోడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగమైనట్లు స్పష్టమైంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లుసమాచారం.’రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కయాదు, ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన ‘ఫంకీ’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.

ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. నాయకత్వం, తిరుగుబాటు మరియు తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధం ఈ కథలో ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో ‘శికంజ మాలిక్’ అనే విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. దసరా చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నాని మరియు కయాదు లోహర్ మధ్య కెమిస్ట్రీ ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. త్వరలోనే ఈ హీరోయిన్ ఎంపికపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.