చార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. నారి నారి నడుమ మురారి టీజర్ ప్రారంభం నుండి ముగింపు వరకు హ్యుమర్ తోనిండి ఉంది, ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది. కేరళ బ్యాక్‌డ్రాప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఈ టీజర్, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకునే ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్కు పునాది వేసింది. హాస్యం, భావోద్వేగం, డ్రామా అన్నింటినీ సమపాళ్లలో కలిపిన సినిమాని ప్రామిస్ చేస్తోంది.
ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శర్వా మాట్లాడుతూ.. “అందరికీ హాయ్. మనం అనుకున్నది సాధించే శక్తి మన అందరిలో ఉంటుంది. ఎవరి ఒపీనియన్స్ పై ఆధారపడకండి. ఎందుకంటే మన లైఫ్ ని మనమే బ్రతకాలి. కష్టపడి చదవండి. భయపడకండి. అనుకున్నది సాధించండి. ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఒకటే విషయం చెప్తాను. సినిమా పొట్టపగిలి నవ్వేలా వుంటుంది. జనవరి 14న రిలీజ్ అవుతుంది. 5:49 ఫస్ట్ షో. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























