డెకాయిట్ కోసం నా హార్ట్ అండ్ సోల్ పెట్టాను – మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Opens Up About Her Dedication to Dacoit

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ నెక్స్ట్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ తో అలరించబోతున్నారు.ఈసినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.మార్చి 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈ టీజర్ రిలీజ్ కోసం ఈవెంట్ ను నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా నా మనసుకు చాలా దగ్గరయింది. నా హార్ట్ అండ్ సోల్ పెట్టాను. టీం కూడా అంతే ప్యాషన్ తో పనిచేశారు. షానియల్ డియోతో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ . ఫిమేల్ ప్రొడ్యూసర్స్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. సీతారామంలో స్వప్న గారు ఇప్పుడు సుప్రియ గారితో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సుప్రియ గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. శేష్ గారు నా మోస్ట్ ఫేవరెట్. తను ట్రూ జెంటిల్మెన్. ఈ సినిమాలో మీరు తన క్యారెక్టర్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. తన స్క్రీన్ ప్రజెంట్ మ్యాజికల్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ థాంక్యు అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.