ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

OTT Release Date Announced for Andhra King Taluka

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ హార్ట్ టచింగ్ డ్రామా ఆంధ్రా కింగ్ తాలూకా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ తెచ్చుకున్నా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది.దాంతో ఈసినిమా యావరేజ్ గా మిగిలిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ కోసం వేచి చూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుండి స్ట్రీమింగ్ లోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ధృవీకరించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. ‘ఎ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ఒక అభిమాని తన ఆరాధ్య దైవమైన హీరో కోసం చేసే త్యాగం మరియు వారి మధ్య ఉండే భావోద్వేగపూరితమైన బంధాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ ద్వయం అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు మరియు మళ్ళీ చూడాలనుకునే వారు ఈ క్రిస్మస్ వీకెండ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించవచ్చు.రామ్ పోతినేని కెరీర్‌లో ఇది ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా నిలిచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.