ది ప్యారడైజ్ లో బిర్యానీ గా సంపూర్ణేష్ బాబు

Sampoornesh Babu as Biryani in The Paradise

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు కామెడీ పాత్రలతో, పేరడీలతో ప్రేక్షకులను నవ్వించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఈ సినిమాలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఒక పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పోషిస్తున్న పాత్ర పేరు ‘బిర్యానీ’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంపూ ఊర మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. చేతిలో బీడీ, మొహమంతా రక్తపు మరకలు, చింపిరి జుట్టుతో చాలా వైలెంట్ లుక్‌లో ఆయన షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు ఆయనను కేవలం కామెడీ హీరోగానే చూసిన ప్రేక్షకులకు, ఈ క్రూరమైన గెటప్ ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆయన హీరో నాని (జడల్) కి అత్యంత ఆప్తమిత్రుడిగా, నమ్మకానికి మారుపేరుగా నిలిచే పాత్రలో కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ఈ పాత్ర కోసం సంపూర్ణేష్ బాబు తన బరువును తగ్గించుకోవడమే కాకుండా, ఫిజికల్ మేకోవర్ కోసం చాలా కష్టపడ్డారట.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.