కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈసినిమా నుండి రీసెంట్ గా రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అనిపించుకొని సినిమాపై అంచనాలు పెంచగా నెక్స్ట్ టీజర్ రానుంది. రేపు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు.ఈసినిమాను రవితేజ డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే పండుగ బరిలో మరి కొన్ని సినిమాలు వస్తుడడంతో ఈసినిమాకు భారీ పోటీ ఎదురుకానుంది.
మరోవైపు ఈసినిమా విజయం రవితేజకి కీలకం కానుంది.రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి తోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి. ఇక రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో తన 77వ సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుందట. అయితే ఈసినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























