AI దుర్వినియోగంపై శ్రీలీల పోస్ట్

రైజింగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్‌మీడియాలో జరుగుతున్న ఏఐ (AI) దుర్వినియోగంపై స్పందిస్తూ అందరినీ ఆలోచింపజేసే విధంగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సులభతరం చేయడానికి ఉండాలి కానీ, అది ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా లేదా వారి గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని శ్రీలీల స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రతి సోషల్‌మీడియా ఖాతాదారుడికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఏఐ సహాయంతో సృష్టించే చెత్తకు సపోర్ట్ చేయొద్దు. టెక్నాలజీని మంచి కోసం వినియోగించడం వేరు, అసభ్యత కోసం వాడటం వేరు. ఈ రెండింటికీ మధ్య చాలా తేడా ఉంది. అభివృద్ధి చెందిన సాంకేతికత వల్ల మన జీవనం మరింత సులభమవ్వాలి, కానీ అది క్లిష్టంగా మారకూడదన్నదే నా అభిప్రాయం.ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు లేదా సహోద్యోగి అయి ఉంటుంది. కళను వారు తమ వృత్తిగా స్వీకరించి ఉండవచ్చు. చిత్ర పరిశ్రమలో భాగస్వాములైన మహిళలందరికీ ఇక్కడ సురక్షితమైన వాతావరణం ఉందనే నమ్మకాన్ని మనం కల్పించాలి.

నా బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేకపోయాను. కానీ కొన్ని బాధాకరమైన విషయాలను నా శ్రేయోభిలాషులు నా దృష్టికి తీసుకువచ్చారు. సాధారణంగా నేను చాలా విషయాలను పట్టించుకోను, కానీ నా తోటి నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవడం చూసి నన్ను ఇది చాలా బాధించింది. అందుకే అందరి తరఫున నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ప్రేక్షకులపై నాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. దీనిపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

ఇక శ్రీలీల ప్రస్తుతం పరాశక్తి , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తుంది. ఇందులో పరాశక్తి తో శ్రీలీల తమిళం లో ఎంట్రీ ఇస్తుంది. సంక్రాంతికి ఈసినిమా విడుదలకు కానుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది వేసవి లో విడుదలకానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈసినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.