ఛాంపియన్ కోసం రానున్న రామ్ చరణ్

Mega Power Star Ram Charan will be gracing the Trailer Launch Event of Champion

శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ విడుదలకు రెడీ అవుతుంది. క్రిస్మస్ రోజున ఈసినిమా థియేటర్లలోకి రానుంది. దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఈవెంట్ ను నిర్వహించనున్నారు.ఇక ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఛాంపియన్ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 18 న విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి సినీ ప్రేక్షకులకు తెలిసిందే. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో చిరంజీవి (శంకర్ దాదా) పక్కనే శ్రీకాంత్ (ఏటీఎమ్) నటించారు. ఇప్పుడు శ్రీకాంత్ కుమారుడి సినిమా ఈవెంట్‌కు చిరంజీవి కుమారుడు చరణ్ రావడం ఆ బంధాన్ని కొనసాగించినట్లయింది.

ఛాంపియన్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక మరియు స్వప్న (స్వప్న సినిమా) నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తొలి సినిమా చిరుతను కూడా వీరే నిర్మించారు. ఆ అనుబంధంతో కూడా చరణ్ ఈ వేడుకకు హాజరవుతున్నారు.

ఛాంపియన్ సినిమాలో రోషన్ మేక సరసన మలయాళీ నటి అనస్వర రాజన్ కథానాయికగా నటించారు. దీనికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సాంగ్స్ , టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.