టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ వెంకటేష్‌పై తన అభిమానాన్ని, అనురాగాన్ని వ్యక్తం చేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“నా ప్రియమైన వెంకటేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ చుట్టూ సానుకూలత, ఆత్మీయతను పంచుతావు. ‘మనా శంకర వర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో మధురమైన జ్ఞాపకం. రాబోయే సంవత్సరం నీ జీవితంలో ఆనందం, ఆశీర్వాదాలతో నిండిపోయి ఉండాలి” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా, మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ శుభాకాంక్షలు వెంకటేష్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి. ఇక టాలీవుడ్‌లో ఎంతో గౌరవం, అభిమానాన్ని సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్‌కు సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























