మన శంకరవరప్రసాద్ గారు సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ఏకంగా 76 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. ఇక నిన్న ఈసినిమానుండి మరో పాట విడుదలైంది. నిజానికి ఈ పాట ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, అనిల్ రావిపూడి దాన్ని ఒక రోజు ముందుగానే (డిసెంబర్ 7న) అడ్వాన్స్ గిఫ్ట్‌గా ఇచ్చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాట విషయానికి వస్తే, ఇది అనిల్ రావిపూడి స్టయిల్లో చాలా క్యాచీగా ఉంది. బాగా డబ్బున్న అమ్మాయిని ఒక మధ్య తరగతి అబ్బాయి ప్రేమించడం, తన ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో కష్టాలు చెప్పుకోవడం, ఆమె సంతోషంగా దాన్ని అంగీకరించడం అనే సింపుల్ కాన్సెప్ట్‌తో ఈ పాట సాగింది.అనంత శ్రీరామ్ సులభమైన పదాలతో సాహిత్యాన్ని అందించిన విధానం బాగుంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ట్యూన్… వాద్యాల హోరు లేకుండా, అచ్చం ‘మీసాల పిల్ల’ తరహాలోనే స్లో పాయిజన్‌లా ఎక్కింది.
భీమ్స్ సిసిరోలియోతో పాటు మధుప్రియ ఈ గీతాన్ని ఆలపించారు.: ‘మీసాల పిల్ల’ తరహాలోనే ‘శశిరేఖా, ఓ ప్రసాదూ’ అంటూ రీల్స్ చేసే జంటలు సోషల్ మీడియాలో భారీగా పెరగబోతున్నందున, ఈ పాట చార్ట్‌బస్టర్ కానుంది.యూట్యూబ్ లో కేవలం సింగిల్ లాంగ్వాజ్ లోనే 24గంటల్లోనే 14 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.
ఇక ప్రస్తుతం చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోస్‌లో టైటిల్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.సంక్రాంతి విడుదలలో ఎలాంటి మార్పులు లేకుండా చెప్పిన సమయానికి రావడానికి చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ఉంది. మిగిలిన పాటలు ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























