ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్( 86) అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ ప్రాంగణంలో ఉన్న తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఆయన డిసెంబర్ 3, 1939న జన్మించారు.నిన్ననే ఆయన 86వ పుట్టినరోజు జరుపుకోగా సరిగ్గా ఒక రోజు తర్వాత కన్నుమూశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శరవణన్ ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవీ మెయ్యప్పన్ చెట్టియార్ గారి మూడో కుమారుడు.1958లో ఏవీఎం బాధ్యతలు స్వీకరించి, దశాబ్దాల పాటు ఈ సంస్థను ఇండియన్ సినిమా రంగంలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.ఆయన హయాంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్‌తో ‘శివాజీ: ది బాస్’, ‘మిన్సార కనవు’, ‘అయన్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.తెలుగులో కూడా ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘సంసారం ఒక చదరంగం’, ‘లీడర్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.ఓవరాల్ గా ఏవీఎం బ్యానర్ పై 300కుపైగా సినిమాలు నిర్మితమయ్యాయి.
శరవణన్ పార్థివ దేహాన్ని ఏవీఎం స్టూడియోస్‌లోని మూడవ అంతస్తులో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు ఈ సాయంత్రం ఏవీఎం ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో జరగనున్నాయి.ఆయన మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సహా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ సంతాపం తెలియజేస్తున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























